సర్వం శివమయం నా అంతర్వాణి తనే అయ్యి
నా అంతర్వాణి ద్వారా నా మహాదేవుడు నాకు చెప్పిన వేమన పద్యాలు. నేను నిమిత్తమాత్రున్ని
సర్వం శివార్పణం.
ఆ. కలియు గంబు నందు కన్నతల్లే స్వార్థి
నిష్క ళంక మాత నిలువ బోదు
ఉన్న తల్లి కైన నోచ ద్దాద రణము
విశ్వ దాభి రామ వినుర వేమ!.......... 1
నిష్క ళంక మాత నిలువ బోదు
ఉన్న తల్లి కైన నోచ ద్దాద రణము
విశ్వ దాభి రామ వినుర వేమ!.......... 1
తాత్పర్యం:
ఈ కలియుగంలో నిస్వార్థమైన, పవిత్రమైన ప్రేమ కరువైపోయింది. చివరకు కన్నతల్లి ప్రేమలో కూడా స్వార్థం ప్రవేశించి, తన అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి దాపురించింది. ఎటువంటి మాలిన్యం లేని నిష్కళంకమైన మనసున్న తల్లి ఈ కాలంలో అరుదైపోయింది. ఒకవేళ ఎక్కడైనా అరుదుగా అటువంటి స్వచ్ఛమైన ప్రేమను పంచే తల్లి ఉన్నా, ఆమెను ఆదరించి గౌరవించే బిడ్డలు గానీ, సమాజం గానీ లేకపోవడం అత్యంత విచారకరం.

ఆ. దైవ ప్రేమ నెరుగ ధరణిలో నెవ్వడు
మృగము చూపు ప్రేమ మెచ్చ రెవరు
ప్రేమ పంచు వాడు పేదగా తోచురా
విశ్వ దాభి రామ వినుర వేమ!................2

ఈ కలియుగంలో మొట్టమొదటి స్వచ్ఛమైన ప్రేమ భగవంతుడిది, కానీ ఆ దైవం ఉన్నాడా లేడా అనే అనుమానంతో దానిని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. రెండవది జంతువుల నిస్వార్థమైన విశ్వాసం మరియు ప్రేమ, అవి మనపై ఎంతటి అనురాగాన్ని చూపించినా మనం వాటిని పట్టించుకోము. ఇక మూడవది, తోటి మనుషులపై నిస్వార్థంగా ప్రేమను చూపించే వ్యక్తిని ఈ సమాజం గౌరవించకపోగా, అతన్ని ఒక చేతగాని వానిగా (పేదగా/బలహీనుడిగా) చూస్తుంది. మనుషుల మనసులు స్పందన కోల్పోయి, ప్రేమను ఇచ్చే వారిని కూడా తిరస్కరిస్తున్న ఈ కలియుగ విచిత్రమిది.

ఆ. దైవ మెపుడు పంపు ధరణిలో సందేశ
రూప మెన్నొ దాల్చి లోక మందు
తెలియ గలుగు వాడు ధన్యుడు జగతిలో
విశ్వ దాభి రామ వినుర వేమ! .... 3
రూప మెన్నొ దాల్చి లోక మందు
తెలియ గలుగు వాడు ధన్యుడు జగతిలో
విశ్వ దాభి రామ వినుర వేమ! .... 3
తాత్పర్యం:
భగవంతుడు ఈ భూమిపై మనకు తన సందేశాలను నేరుగా కాకుండా, అనేక రూపాలలో (మనుషుల ద్వారా, సంఘటనల ద్వారా) పంపిస్తూనే ఉంటాడు. ఆ సందేశాల వెనుక ఉన్న దైవ సంకల్పాన్ని ఎవరైతే వివేకంతో గుర్తుపడతారో, వారే ఈ లోకంలో నిజమైన ధన్యులు. మన చుట్టూ ఉన్న ప్రతి రూపంలోనూ ఆ పరమశివుడి సందేశం దాగి ఉంటుందని గ్రహించడమే అసలైన ఆధ్యాత్మికత

ఆ. కామ మోహ ముననె కలుగును విరక్తి
భక్తి తోడ గలుగు ముక్తి మార్గ
ఊట నీటి వోలె శివభక్తి ఊరును
విశ్వ దాభి రామ వినుర వేమ! .... 4
భక్తి తోడ గలుగు ముక్తి మార్గ
ఊట నీటి వోలె శివభక్తి ఊరును
విశ్వ దాభి రామ వినుర వేమ! .... 4
తాత్పర్యం:
శారీరకమైన కామ మోహాలు తాత్కాలికమైనవి; అవి అనుభవించిన కొద్దీ విరక్తిని, చివరకు అసహ్యాన్ని కలిగిస్తాయి. కానీ పరమశివునిపై ఉండే భక్తి అటువంటిది కాదు; అది మోక్షానికి దారి చూపే నిరంతర ప్రవాహం. సముద్ర తీరాన గుంట తవ్వితే నీరు ఎలా స్వచ్ఛంగా ఊరుతూనే ఉంటుందో, శివ భక్తి కూడా హృదయంలో అంతకంతకూ పెరుగుతూ, అంతులేని ఆనందాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది

ఆ. బ్రహ్మ జ్ఞాన మెరుగ బరులకు దెలుపదు
స్వయము గాను గనున అనుభవంబు
వేద సార మెల్ల ధ్యానాన దెలియురా
విశ్వ దాభి రామ వినుర వేమ! .... 5
స్వయము గాను గనున అనుభవంబు
వేద సార మెల్ల ధ్యానాన దెలియురా
విశ్వ దాభి రామ వినుర వేమ! .... 5
తాత్పర్యం:
బ్రహ్మజ్ఞానం అనేది ఇతరులకు చెబితే అర్థమయ్యేది కాదు, అది కేవలం తన అంతరంగంలో తాను పొందే అనుభవం. వేదాలలోని పరమార్థం కూడా ప్రాచీన ఋషులు ధ్యానంలో పొందిన అనుభవాలే. ఆ అక్షర సత్యాలు ఎప్పటికీ మారవు. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం అనుభూతి చెందగలము.